‘పుష్ప2’తో ఇండియన్ సినిమా రికార్డులన్నింటినీ స్మాష్ చేసేశాడు అల్లు అర్జున్. దాంతో ఆయన చేయబోయే సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఉంటుందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో బలంగానే వినిపించింది. అయితే.. బౌండ్ స్క్రిప్ట్‌తోనే త్రివిక్రమ్ సెట్స్‌కి వెళ్లాలని ఫిక్స్ అయ్యారట. అందుకోసం కాస్త సమయం తీసుకోనున్నట్టు సమాచారం. ఈ వేసవిలో కొబ్బరికాయ కొట్టేసినా.. షూటింగ్ మాత్రం ఆలస్యం కానుందని తెలుస్తున్నది. అందుకే.. ఈలోపు అట్లీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారట బన్నీ. ఇది ఎప్పట్నుంచో అనుకుంటున్న కాంబినేషన్.
అయితే.. కొన్ని కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతమైతే ఈ కాంబో దాదాపు ఫిక్సయిందని, త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని బలంగానే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో కథానాయికగా జాన్వీకపూర్ ఫిక్స్ అయ్యిందట. ‘పుష్ప2’ ఐటమ్ నంబర్ కోసం జాన్వీని సంప్రదిస్తే ‘నో’ చెప్పంది. బన్నీతో ఐటమ్‌సాంగ్ చేస్తే హీరోయిన్గా చేయడం ఆలస్యమవుతుందనే జాన్వీ ‘నో’ చెప్పిందట. తన అంచనా నిజమై.. అనుకున్నట్టే ‘పుష్ప2’ వెంటనే బన్నీతో ఛాన్స్ కొట్టేసింది జాన్వీ. అనిరుథ్ ఈ సినిమాకు స్వరాలను సమకూరుస్తారని సమాచారం. ‘జవాన్’కి పనిచేసిన బృందంలో చాలామంది ఈ సినిమా క్కూడా పనిచేస్తారట.