Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి పెద్దమనసును చాటుకున్నాడు. లైంగిక వేధింపులకు గురైన మహిళకు తానున్నాను అంటూ అండగా నిలిచాడు. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఒక మహిళ కొరియోగ్రాఫర్ హైదరాబాద్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో బాధితురాలికి అండగా నిలిచాడు అల్లు అర్జున్. తనకు ఆర్థిక సహాయం కింద ఫ్యూచర్లో గీత ఆర్ట్స్ బ్యానర్లో వచ్చే అన్ని ప్రాజెక్ట్‌లకు ఆమెను కొరియోగ్రాఫర్‌గా ఎంచుకున్నట్లు నిర్వహాకులు ప్రకటించారు. అంతేగాకుండా.. లైంగిక ఆరోపణలు ఎదుర్కోంటున్న జానీ మాస్టర్‌పై వెంటనే విచారణ వేగం శిక్ష పడేలా చేయాలని అల్లు అర్జున్ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తనను లైంగికంగా వేధించాడంటూ ఒక మహిళ కొరియోగ్రాఫర్ హైదరాబాద్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు జానీ మాస్ట్ర్పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద కేసులు నమోదు చేశారు. ఇక జానీ మాస్టర్ లాంటి వాళ్లని కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుతున్నారు.
#AlluArjun assured the victim in the #JaniMaster case that he would provide work for all his upcoming films and films under the Geetha Arts banner. A great gesture! 🙌❤️ pic.twitter.com/TRIHEEulot
— Movies4u Official (@Movies4u_Officl) September 17, 2024
Also Read..