Pushpa-2 Collections | అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 మూవీ కలెక్షన్లు కొనసాగుతున్నాయి. హిందీ బెల్ట్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నది. మూవీ విడుదలైన 18వ రోజున (డిసెంబర్ 22న) సైతం రూ.33.25కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మూడోవారం వీకెండ్లో రూ.72.3కోట్లు వసూలు చేసింది. పలు చిత్రాల ఓపెన్సింగ్స్కు సైతం ఇంత కలెక్షన్స్ రాలేవని.. మూవీ కలెక్షన్స్‌ని ట్రాక్ చేసే ‘శాక్నిల్క్’ పేర్కొంది. వీకెండ్ శనివారం రూ.14.3కోట్లు, శనివారం రూ.24.75కోట్లు, ఆదివారం రూ.33.25కోట్లు వచ్చాయని శాక్నిల్క్ చెప్పింది. దాంతో మొత్తంగా పుష్ప వసూళ్లు రూ.1,062.9కోట్లకు చేరాయని పేర్కొంది. దాంతో బహుబలి-2 మూవీ కలెక్షన్స్ రికార్డును పుష్ప-2 అధిగమించినట్లేనని సినీ పండితులు పేర్కొంటున్నారు. ఇక వీకెండ్ కలెక్షన్స్ అన్నీ కలుపుకొని ప్రపచంవ్యాప్తంగా కలెక్షన్స్ రూ.1600 కోట్లు దాటి.. అత్యధికంగా వసూళ్లు రాబట్టిన మూడో ఇండియన్ సినిమాగా నిలిచింది. దంగల్ రూ.2వేలకోట్లకుపైగా, రెండోస్థానంలో బాహుబలి-2 రూ.1790 కోట్లు రాబట్టాయి. క్రిస్మస్ సెలవులు, న్యూ ఇయర్ వరకు సెలవులు ఉండడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.