Pushpa 2 The Rule | అభిమానుల ఎన్నో రోజుల ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెడుతూ పుష్పరాజ్ అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్‌ఫైర్ అనుకుంటూ అల్లు అర్జున్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ట్రైలర్ సెకండ్స్‌లోనే మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకొని యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్‌కు సంబంధించి ఉత్తరాదిలో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు అల్లు అర్జున్.
ఈ సినిమా ట్రైలర్ వేడుకను బిహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకతో అరుదైన రికార్డును నమోదు చేశాడు అల్లు అర్జున్. ఇప్పటివరకు ఉత్తరాదిలో ఏ నటుడికి రాని విధంగా.. ఒక హీరో సినిమా వేడుకకు 2 లక్షల మందికి పైగా హాజరు అయినట్లు తెలుస్తుంది. ఇంతకుముందు ఈ రికార్డు షారుఖ్ ఖాన్ పేరిటా నమోదు అయ్యింది. 2011లో షారుఖ్ నటించిన డాన్ 2 సినిమాకి పాట్నాలో ఇదే రేంజ్లో అభిమానులు రాగా.. ఇప్పుడు మళ్లీ అదే రేంజ్లో కనిపించడంతో ఇండియాకి కొత్త సూపర్ స్టార్ వచ్చాడని.. షారుఖ్ తర్వాత ఆ రేంజ్ ఉన్న హీరో అల్లు అర్జున్ మాత్రమేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ముంబై పుష్ప 2 ప్రమోషన్స్‌లో భాగంగా షారుఖ్ ఖాన్ చీఫ్ గెస్ట్‌గా హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే.. ముంబై మొత్తం అట్టుడికి పోతుందని టాక్.
Around 2 Lakh People Attended Pushpa 2 The Rule Trailer Launch Event ✅💥
Second Biggest Crowd For An Event After Shah Rukh Khan’s Event In Patna, Bihar.
P E A K 🔥⚠️🥶#Pushpa2TheRuleTrailer pic.twitter.com/kvVUvccsOc
— SUNNY ALLU ARJUN 🪓💥 (@Harsha99759812) November 17, 2024