Allu Arjun| గంగోత్రి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన అల్లు అర్జున్ ఆనతి కాలంలోనే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. బన్నీ నటించిన పుష్ప సినిమాకి ఆయనకి విపరీతమైన క్రేజ్ దక్కేలా చేసింది. ఖ్యాతి ఎల్లలు దాటింది. పుష్ప సినిమాలోని బన్నీ మ్యానరిజాన్ని క్రికెటర్స్, పొలిటికల్ లీడర్స్ కూడా అనుకరించారంటే ఆయన రేంజ్లో అందరిని అట్రాక్ట్ చేశాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక పుష్ప చిత్రం తర్వాత బన్నీ పుష్ప 2 తో పలకరించాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. చిత్రానికి మిశ్రమ స్పందన దక్కినప్పటికీ పుష్ప2 బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది.
పుష్ప 2 చిత్రం సౌత్ ను మించి నార్త్ లో హంగామా చేసింది. రూ.1870 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసి అదరహో అనిపించింది. ఈ చిత్రం బాహుబలి రికార్డును బ్రేక్ చేసి ఇండియాలోనే సెకండ్ హ్యయేస్ట్ గ్రాసర్ గా రికార్డు క్రియేట్ చేయడం విశేషం. ఇక పుష్ప2 తర్వాత బన్నీ ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఏ దర్శకుడితో చేస్తాడు, ఎలాంటి స్టోరీని ఎంపిక చేసుకుంటాడు అని అభిమానులు ముచ్చటించుకుంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ చాలా డైలమాలో ఉన్నట్టు అర్ధమవుతుంది.
ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఏ ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. పుష్ప 2 తర్వాత ఏ సినిమా చేస్తే జనాలకి ఎక్కుతుంది అనే విషయంలో సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తుంది. చాలా మంది నిర్మాతలు, దర్శకులు కథలు పట్టుకుని బన్నీ చుట్టూ తిరుగుతున్నా కూడా మనోడు మాత్రం పాన్ ఇండియాకి తగ్గట్టు సినిమా చేయాలని అనుకుంటున్నాడట. త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా కథలో పలు మార్పులు చేయాలని అంటున్నాడట. అలానే అట్లీని తరచుగా కలుస్తూ కథ విషయంలో పలు డిస్కషన్స్ చేస్తున్నాడట. మరి ఎప్పుడు కొత్త ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేస్తాడన్నది చూడాల్సి ఉంది. నార్త్ మార్కెట్ ని ఎట్టి పరిస్దితుల్లో చేజార్చుకోవద్దు అని బన్నీ గట్టిగా భావిస్తున్నాడు. అందుకే కాస్త టైం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.