హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)టాలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే నటుడిగా నిలిచారు. బాహుబలి ప్రభాస్‌ను అధిగమించిన బన్నీ ఈ అరుదైన ఘనత సాధించారు. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే తొలి హిందీ మూవీకి ఐకాన్ స్టార్ భారీ మొత్తాన్ని అందుకోనున్నట్టు సమాచారం.
టీ సిరీస్ ప్రొడక్షన్ కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ. 125 కోట్లు పారితోషికంగా రాబడుతున్నట్టు చెబుతున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని లేటెస్ట్ రిపోర్ట్. టిసిరీస్ బ్యానర్‌పై సందీప్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్‌లతో అల్లు అర్జున్ కలిసి పనిచేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
వంగా సందీప్‌రెడ్డి కాంబినేషన్లో చిరకాలం గుర్తుండే సినిమా అందిస్తామని ఆశిస్తున్నట్టు అల్లు అర్జున్ ఇటీవల ట్వీట్ చేశారు. కాగా ఐకాన్ స్టార్ పుష్ప పార్ట్ 2 షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు. ఈ మూవీలో రష్మిక మందన్నతో పాటు సాయిపల్లవి కూడా జాయిన్ కానున్నారని చెబుతున్నారు.
Read More :