Allu Arjun | టాలీవుడ్లో తనకు కాంపిటీషన్ ఎవరు అనే దానిపై దిమ్మదిరిగే సమాధానమిచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప ది రూల్. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 05 వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడటంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు బన్నీ. తాజాగా బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ఆన్స్టాపబుల్ సీజన్ 4కి కూడా ముఖ్య అతిథిగా వచ్చాడు. అయితే ఈ షోలో బాలకృష్ణ అడిగిన ఒక ప్రశ్నకు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చాడు అల్లు అర్జున్.
టాక్ షోలో భాగంగా.. బాలయ్య అడుగుతూ.. టాలీవుడ్లో నీకు బిగ్గెస్ట్ కాంపిటీషన్ ఎవరు. ప్రభాస్ లేదా మహేశ్ బాబు అంటూ బన్నీని అడుగుతాడు. దీనికి బన్నీ నన్ను మించి ఎదిగేటోడు ఇంకొకడు ఉన్నాడు చూడు. ఎవడు అంటే అది రేపటి నేనే అంటూ పుష్ప సినిమాలోని పాటను పాడాడు అల్లు అర్జున్. దీంతో అల్లు అర్జున్‌కి అల్లు అర్జునే పోటి అంటూ ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Balayya : Nee biggest competitor evaru? Prabhas or MB
Bunny : Nannu minchi edhigetodu inkodunnadu chudu evadu antey adhi repati neney💥🔥🥵@alluarjun anna Mass dialogue 🌪️ pic.twitter.com/MrW98fYLsU
— Hell King Sai (@hell_king_Sai) November 14, 2024