AA22xA6 | పుష్ప 2 ది రూల్ తర్వాత అల్లు అర్జున్ కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా ప్రాజెక్ట్ AA22xA6 (వర్కింగ్ టైటిల్). కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అంటూ నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. కాగా దీనికి సంబంధించి క్లారిటీ వచ్చేసినట్టు తాజా ట్వీట్ ఒకటి చెబుతోంది. చాలా మంది అనుకున్నట్టుగానే ఈ చిత్రానికి సాయి అభ్యాంకర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించబోతున్నాడు. ఇటీవలే డ్యూడ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు సాయి అభ్యాంకర్.
నేడు సాయి అభ్యాంకర్ బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలియజేశాడు. మై బ్రదర్.. నీకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రానున్న ఏడాది మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నానని ట్వీట్ చేశాడు. బన్నీ చేసిన ఈ బర్త్ డే విషెస్ ట్వీట్‌తో సాయి అభ్యాంకర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దాదాపు ఫైనల్ అయినట్టేనని ఫిక్సయిపోతున్నారు అభిమానులు. ఈ యువ మ్యూజిక్ డైరెక్టర్ అల్లు అర్జున్ సినిమాకు పనిచేస్తుండటంతో అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. మరి రాబోయే రోజుల్లో మేకర్స్ ఏదైనా అధికారిక ప్రకటన జారీ చేస్తారేమో చూడాలి.
మూవీ రిలీజ్ ఎప్పుడనేది పొంగళ్ 2026 సమయంలో మేకర్స్ ప్రకటిస్తారని బన్నీ వాసు చెప్పాడని తెలిసిందే. అల్లు అర్జున్, అట్లీ కాంబోలో తొలిసారి వస్తున్న సినిమా కావడం.. లీడింగ్ బ్యానర్ అయిన సన్ పిక్చర్స్‌లో వస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

Aa22xa6 A
NC 24 | నాగచైతన్య – మీనాక్షి చౌదరి జంటగా ‘NC24’ ..ఆసక్తి రేపుతున్న దక్ష లుక్