అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్‌తో కూడిన ఓ భారీ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘AA22xA6’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక పానిండియా చిత్రం ఇప్పటికే 50రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్నది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన తాజా అప్టేట్ ఏంటంటే.. ఈ చిత్రబృందం వీఎఫ్ఎక్స్ పనుల నిమిత్తం అమెరికాకు బయలుదేరింది. కథరీత్యా ఇందులో భారీ వీఎఫ్ఎక్స్ అవసరం. దీని కోసం హాలీవుడ్ నిపుణులు పనిచేయనున్నారు.
ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ అక్టోబర్ నుంచి మొదలు కానున్నదని, అబుదాబిలోని లివా ఒయాసిస్‌లో జరిగే ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని, ఈ షెడ్యూల్లో కథానాయిక దీపిక పదుకొణ్ కూడా జాయిన్ అవుతారని సమాచారం. 600కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియాలో సినిమాలో రష్మిక మందన్నా, మృణాళ్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా కీలక పాత్రల్లో కనిపిస్తారట. సన్ నెట్వర్క్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.