నా ఉగ్రరూపం చూస్తారు
అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల దర్శకుడు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది.
అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల దర్శకుడు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో నరేష్ మాట్లాడుతూ “నాంది’ సినిమా చేసినప్పుడు ఎలా గర్వంగా ఫీలయ్యానో ఇప్పుడు అదే భావనతో ఉన్నా. నవరసాల్లో హాస్యాన్ని పండించడం చాలా కష్టం. ఏడిపించడం సులువు. కామెడీ చేసిన వారు నవరసాల్లో దేనినైనా పండించగలరు. నా కెరీర్లో గమ్యం, శంభో శివ శంభో, మహర్షి చిత్రాలు కథాంశాల ఎంపికలో కొత్తదారులను చూపించాయి.
ఈ క్రమంలోనే నాంది, ఉగ్రం లాంటి సినిమాలు చేసే అవకాశం దొరికింది. ‘ఉగ్రం’లో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా సహజంగా అనిపిస్తాయి. ఈ సినిమాలో నేను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తా. ఇందులో నటనాపరంగా నా ఉగ్రరూపం చూస్తారు’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ కథ అనుకున్నప్పుడే నరేష్ను ఊహించుకున్నా. యాక్షన్తో పాటు ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా ఉంటాయి. కథాగమనంలో హీరోయిన్ పాత్ర కూడా కీలకంగా ఉంటుంది’ అన్నారు. మిస్సింగ్ కేసులు దేశవ్యాప్తంగా నమోదవుతున్నా యని, ఈ కథపై విస్త్రతంగా పరిశోధన చేశానని రచయిత తూమ్ వెంకట్ తెలిపారు. తమ సంస్థకు మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందని నిర్మాతలు చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

