Allari Naresh | ఇండస్ట్రీకి బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు ఒకరు.. తన కామెడీ టైమింగ్‌తో మూవీ లవర్స్‌ను కడుపుబ్బా నవ్వించిన హీరో మరొకరు. ఈ ఇద్దరి కాంబినేషస్ తెరపైకి వస్తుందంటే ఎలా ఉంటుంది. ఈ క్రేజీ న్యూస్ ఎవరి గురించనుకుంటున్నారా..? ఒకప్పుడు ఇండస్ట్రీకి మరిచిపోలేని హిట్స్ ఇచ్చి.. ఆ తర్వాత చాలా కాలం నుంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు శ్రీను వైట్ల (Srinu Vaitla). ఇక నాంది సినిమా తర్వాత గ్రాండ్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన అల్లరి నరేశ్ (Allari Naresh). ఈ టాలెంటెడ్ యాక్టర్ మే 5న ఉగ్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి సక్సెస్ అందుకున్నాడు.
మహేశ్ బాబు, రవితేజ, నాగార్జున, వెంకటేశ్, ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి ఏ లిస్ట్ హీరోలతో పనిచేసిన శ్రీనువైట్ల.. ఆ తర్వాత ఢీ సీక్వెల్‌ను లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం అనుకోని కారణాలతో అటకెక్కింది. నరేష్ నటించిన ఉగ్రమ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ట్రేడ్ అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయిందన్న టాక్ కూడా జోరుగా నడుస్తుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ శ్రీను వైట్ల నెక్ట్స్ అల్లరి నరేష్‌తో సినిమా చేసే అవకాశాలున్నాయన్న వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది.
2018లో రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంథోనీ తర్వాత శ్రీను వైట్ల కాంపౌండ్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. దూకుడు తర్వాత చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో అల్లరి నరేష్ – శ్రీను వైట్ల కాంబోలో సినిమా వస్తే ఖచ్చితంగా అది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే పర్ఫెక్ట్ కాంబినేషన్ అవడమే కాకుండా.. ఈ ఇద్దరికి సూపర్ హిట్టు పడటం గ్యారంటీ అంటున్నారు సినీ జనాలు. మరి ఈ క్రేజీ వార్తలపై అల్లరి నరేశ్ కానీ, శ్రీను వైట్ల కానీ ఏదైనా స్పందిస్తారేమో చూడాలంటున్నారు మూవీ లవర్స్.
Sakshi Vaidya | గాండీవధారి అర్జున అప్డేట్.. సాక్షి వైద్య డబ్బింగ్ షురూ
Leo | లియో షూట్లో జాయిన్ అయిన మలయాళ భామ