Vedaraju Timber| టాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత (Vedaraju Timber) వేదరాజు టింబర్ (54) కన్నుమూశారు. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వేదరాజు టింబర్ కొన్ని నెలలుగా హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంలో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.
వేదరాజు టింబర్ అల్లరి నరేశ్‌తో మడత కాజా, సంఘర్షణ సినిమాలను తెరకెక్కించారు. కాగా వేదరాజు టింబర్ నెక్ట్స్ ప్రొడక్షన్ వెంచర్‌కు ప్లాన్ చేస్తుండగా.. ఇలా జరుగడంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వేదరాజు టింబర్‌కు భార్య, కూతురున్నారు. వేదరాజు మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు ఓ ప్రకటనలో తెలియజేశారు.
Ram Gopal Varma | సిండికేట్‌పై వర్క్ చేస్తున్నా.. కానీ ఆ వార్తలు అబద్ధం.. పుకార్లపై రాంగోపాల్ వర్మ
Sai Pallavi | తండేల్కు సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్.. ఈ సారి నో కాంప్రమైజ్..!