Allari Naresh | సినీయర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో హాస్యాస్పద సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నటుడు అల్లరి నరేష్. ఏడాదికి రెండు మూడు సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు. యువ దర్శక, నిర్మాతలకు కామెడీ జోనర్లో సినిమా చేయాలంటే మొదట గుర్తొచ్చే పేరు అల్లరి నరేష్. అంతలా ఈయన తన నటన, కామెడీ టైమింగ్‌తో రెండు గంటలు హాయిగా నవ్వుకునేలా చేస్తాడు. అయితే గతకొంత కాలంగా ఈయన సినిమాలు ఒకే పంతాలో ఉండటంతో ప్రేక్షకులు నరేష్ సినిమాలను థియేటర్లలో చూడటానికి అంతగా ఆసక్తి చూపడంలేదు. దాంతో నరేష్ రోటీన్‌కు భిన్నంగా గతేడాది ‘నాంది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కామెడీని పక్కన పెట్టి మొదటి సారి పూర్తి స్థాయిలో నరేష్ ఈ చిత్రంలో సీరియస్ రోల్ పోషించాడు. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది.
ప్రస్తుతం ఈయన రెండు సినిమాలలో నటిస్తున్నాడు. అందులో ‘సభకు నమస్కారం’ ఒకటి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇక లేటెస్ట్‌గానే ఈయన ఏఆర్ మోహన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే శ్రీరామ నవమీ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో నరేష్ ఎలక్షన్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. శ్రీదేవీ సోడా సెంటర్ ఫేం ఆనంది హీరోయిన్గా నటిస్తుంది. జీ స్టూడియోస్, హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
On this auspicious Sri Rama Navami, blessed to share with you the title of my next #ItluMaredumilliPrajaneekam #Naresh59 #IMP @raajmohan73 🎬@anandhiactress @ZeeStudios_ @HasyaMovies @RajeshDanda_ @vennelakishore @lemonsprasad @_balajigutta @abburiravi @SricharanPakala pic.twitter.com/Pu1uHvA2FL
— Allari Naresh (@allarinaresh) April 10, 2022
Read Also:
Pawan Kalyan | చిరంజీవి కోసం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగనున్నాడా?
Teja | బాలీవుడ్లో బిజీకానున్న టాలీవుడ్ డైరెక్టర్?
Puri Jagannadh | పూరీ కలను నెరవేర్చిన మెగాస్టార్.. ఇన్నేళ్ళకు ఛాన్స్ ఇచ్చిన చిరు