బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్‌కపూర్, అలియాభట్‌కు చెందిన నూతన గృహ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. ముంబయిలో అత్యంత విలాసవంతంగా నిర్మించుకున్న ఈ భవంతి ఖరీదు 250కోట్లకుపైగా ఉంటుందని చెబుతున్నారు. రణబీర్‌కపూర్ అమ్మమ్మ కృష్ణరాజ్ కపూర్ పేరుమీద ఈ ఇంటిని నిర్మించారు. దాదాపు ఆరు అంతస్తులు కల ఈ భవంతిని రణబీర్, అలియా తమ వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దారని, దాదాపు రెండేళ్లుగా దీని నిర్మాణంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారని అంటున్నారు.
బాలీవుడ్ లెజెండ్ రాజ్‌కపూర్ ఇక్కడే నివాసం ఉండేవారట. వారసత్వంగా ఈ ప్రాపర్టీ రణబీర్‌కపూర్‌కు దక్కిందట. దాంతో ఈ గృహాన్ని తమ కలలసౌధంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో రణబీర్-అలియా అంత భారీ మొత్తాన్ని వెచ్చించారని తెలిసింది. త్వరలో గృహప్రవేశానికి ఈ స్టార్‌కపుల్ సిద్ధమవుతున్నారు. ఇదిలావుండగా ఈ దంపతులు ‘లవ్ అండ్ వార్’ చిత్రంలో జంటగా నటిస్తున్నారు.