బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ ( Ranbir Kapoor) ఎట్టకేలకు ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఐదేండ్ల పాటు అలియాభట్ (Alia Bhatt) తో డేటింగ్ జీవితం కొనసాగించిన రణ్‌బీర్.. పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. అలియాభట్, రణబీర్ వివాహం ఏప్రిల్ 14న ముంబైలో జరగనున్నట్లు రాబిన్ భట్ వెల్లడించారు. అలియా మెహిందీ వేడుక 13న నిర్వహించనున్నారు.
కపూర్ వంశానికి చెందిన వారసత్వ నివాసం ఆర్కే బంగ్లా(ముంబై)లో ఈ పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని అలియా అంకుల్ రాబిన్ తెలిపారు. వివాహం అనంతరం ఈ జంట హానీమూన్ ట్రిప్ కోసం సౌతాఫ్రికా వెళ్లనుంది.
రణ్‌బీర్, అలియా వివాహ వేడుకకు కరణ్ జోహర్, షారూక్ ఖాన్, సంజయ్ లీలా బన్సాలీ, అనుష్క రంజన్, ఆకాన్ష రంజన్, రోహిత్ ధవన్, వరుణ్ ధవన్, జోయా అక్తర్‌తో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీస్ హాజరు కానున్నారు.