ALI | ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఓ కార్యక్రమంలో కమెడియన్ అలీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదం అయ్యాయో మనం చూశాం. పదే పదే ఆయన సభా మర్యాద మరిచి అలా మాట్లాడుతుండడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై తాజాగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. నేను చేసిన కొన్ని వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎప్పుడూ సరదాగా ఉండే వ్యక్తినని స్పష్టం చేశారు. నేను మాట్లాడిన మాటలని తప్పుగా అర్ధం చేసుకోవడం మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది.
వాటిని తప్పుగా అర్థం చేసుకోకుంటే అది మీ ఖర్మ. నేనైతే ఇలానే ఎప్పుడూ సరదాగానే ఉంటాను. మీడియాను నా కుటుంబంగా భావిస్తాను. నన్ను మీరంతా అన్నయ్య అని పిలవడం నా అదృష్టం అంటూ రాజేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు . మనం నటించే సినిమాల్లో మనం కనిపించకూడదు, పాత్రలే కనిపించాలి. నాతో పనిచేసిన నటీనటులంతా నాతో సరదాగానే ఉంటారు. అందులో తప్పేం లేదు అని ఆయన వివరించారు. అయితే ఈ వివాదంపై తాజాగా అలీ స్పందించారు.
రాజేంద్రప్రసాద్ బూతులపై నెలకొన్న వివాదంలో ఆలీ స్పందిస్తూ.. ఆయన కావాలని అలా మాట్లాడలేదని, అనుకోకుండా మాట తూలిందని తెలిపారు. ఆయన కుమార్తె మరణంతో కొంత బాధలో ఉన్నారని అన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఈవెంట్ లో అనుకోకుండా రాజేంద్రప్రసాద్ కి మాట తూలింది. సరదాగా అన్న మాటలను మీడియా మిత్రులు వైరల్ చేస్తున్నారు. ఆయన మంచి ఆర్టిస్ట్. పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన కూతురు పోయింది. అమ్మలాంటి బిడ్డ చనిపోవడంతో అలా అయిపోయారు. ఆయన కావాలని చెప్పింది కాదు. ఆయన పెద్దాయన. ప్లీజ్.. ఎవరూ దీన్ని పెద్దది చేయకండి అంటూ ఆలీ వీడియో ద్వారా తెలియజేశారు. రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి గతేడాది (2024 అక్టోబర్ 5న) మరణించిన విషయం తెలిసిందే.
#RajendraPrasad ఆయనకి ఈవెంట్ లో మాట తూలింది, ఆయన మంచి ఆర్టిస్ట్ – Actor ALi pic.twitter.com/92sUqj9WTP
— Rajesh Manne (@rajeshmanne1) June 2, 2025