చెన్నై: మద్యం సేవించడమనేది తన జీవితంలో అతిపెద్ద తప్పిదమని సూపర్‌స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యానించాడు. తాను గనుక ఆల్కహాల్ అలవాటు చేసుకోకపోయి ఉంటే.. సమాజానికి ఎంతో సేవ చేసేవాడినని అన్నాడు. ఆల్కహాల్ మనిషి ఆరోగ్యాన్ని పాడు చేయడమేగాక, విలువైన సమయాన్ని కూడా వృథా చేస్తుందని ఆయన పేర్కొన్నాడు.
ఆల్కహాల్ జోలికి వెళ్లకపోయి ఉంటే నేను కచ్చితంగా ఎంతో చేసేవాడినని రజినీకాంత్ చెప్పుకొచ్చాడు. సినిమాల్లో కూడా ఇప్పుడున్న స్థాయి కంటే ఇంకా పెద్ద స్టార్‌ను అయ్యేవాడినని వ్యాఖ్యానించాడు. మద్యం అలవాటు లేకపోతే మనిషి ఎంతో సమయం చిక్కుతుందని చెప్పాడు. ఇటీవల జరిగిన ఓ సినిమా కార్యక్రమంలో రజినీ ఈ వ్యాఖ్యలు చేశాడు.