శ్వేతా పరాశర్, యష్‌పూరి, అజయ్ కతుర్వార్, ప్రవీణ్ యండమూరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అలాంటి సిత్రాలు’. సుప్రీత్ సి.కృష్ణ స్వీయ దర్శకత్వంలో రాఘవేంద్రరెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రం నేటి నుండి జీ 5 ఓటీటీలో వీక్షకులకు అందుబాటులో వుంది. కాగా గురువారం చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘న్యూ ఏజ్ కాన్సెప్ట్ సినిమా ఇది. అన్ని రకాల ఎమోషన్స్‌ను మిక్స్ చేసి అందర్ని అలరించేలా తెరకెక్కించిన ఈ చిత్రంలో వున్న క్యూట్ లవ్‌స్టోరీ కూడా అలరిస్తుంది’ అన్నారు.