Akshay Kumar | గత ఏడాది నుంచి వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తాజాగా ముంబైలోని హాజీ అలీ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నేడు హాజీ అలీ దర్గాకు చేరుకున్న అక్షయ్‌కు హాజీ అలీ దర్గా ట్రస్ట్ అలాగే మాహిమ్ దర్గా ట్రస్ట్ యొక్క మేనేజింగ్ ట్రస్టీ సుహైల్ ఖాండ్వానీ ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్షయ్ కుమార్ చేత ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. అయితే హాజీ అలీ దర్గా ప్రస్తుతం మరమ్మతులు జరుపుకుంటుండగా దర్గా రేనోవేషన్ కోసం అక్షయ్ కుమార్ రూ.1.21 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని హాజీ అలీ ట్రస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మహ్మద్ అహ్మద్ తాహెర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక అక్షయ్ దర్గాను సందర్శించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గత ఏడాది నుంచి అక్షయ్ సినిమాలు 8 విడుదల కాగా.. అందులో ఏడు ఫ్లాప్ అందుకున్నాయి. ఇక ఆయన ఆశలన్నీ ప్రస్తుతం వస్తున్న ఖేల్ ఖేల్ మే అనే చిత్రం పైనే ఉన్నాయి. అక్షయ్ కుమార్, తాప్సీ పన్ను ప్రధాన పాత్రల్లో ఈ సినిమా వస్తుండగా.. ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కామెడీ & ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో వాణి కపూర్, అమ్మీ విర్క్, ఆదిత్య సీల్, ప్రగ్యా జైస్వాల్, ఫర్దీన్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఇండిపెండెన్స్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Akshay Kumar donated 1.21 Cr to Mumbai’ Haji Ali daragah, Dargah comittee says this is for renovation. #AkshayKumar #HajiAliDargah #अक्षयकुमार pic.twitter.com/HjXpLAt1qK
— Namrata Dubey (@namrata_forNews) August 8, 2024
Also Read..