మన సినిమాలకు విదేశాలలోను ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొందరు సినీ ప్రియులు మన సినిమాలలోని పాటలను రీ క్రియేట్ చేస్తూ అభిమానం కనబరుస్తూ ఉంటారు. తాజాగా ఇండోనేషియన్స్ అక్షయ్ కుమార్ మూవీలోని సాంగ్‌కి అద్భుతంగా డ్యాన్స్ చేసి అదరగొట్టారు. వారి పర్ఫార్మెన్స్కి అక్షయ్ కూడా ఫిదా అయ్యారు.
అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం సూర్య వంశీ. ఇందులో రణ్వీర్ సింగ్, అజయ్ దేవ్‌గణ్ అతిథి పాత్రలు పోషించారు. రోహిత్ శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలై సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలోని ‘నాజానాజా’ అనే పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అక్షయ్, కత్రినా వేసిన స్టెప్పులు సినీ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి.
ఈ క్రమంలో ‘నాజానాజా’ పాటకు ఇండోనేషియాకు చెందిన అనే ఓ యూట్యూబర్ జంట అద్భుతంగా డ్యాన్స్ చేసింది. అక్షయ్- కత్రినా లను అనుకరిస్తూ సేమ్ అలాంటి కాస్ట్యూమ్స్ ధరిస్తూ సూపర్బ్‌గా స్టెప్పలేశారు. దీనికి ఫిదా అయిన అక్షయ్ కుమార్… ‘మీ రీక్రియేషన్ నాకు బాగా నచ్చింది. అద్భుతమైన ప్రయత్నం’ అంటూ కామెంట్ పెట్టారు. ఇందులో డ్యాన్స్ చేసిన వినఫాన్ అనే యూట్యూబర్ ఇండోనేషియాలో బాగా ఫేమస్ . బాలీవుడ్ పాటలకు కాలు కదుపుతూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు.
Loved the recreation! Amazing effort. https://t.co/Mw8XINpbFU
— Akshay Kumar (@akshaykumar) December 1, 2021