అక్షయ్‌కుమార్, రాధిక మదన్ జంటగా నటించిన తదుపరి చిత్రానికి ఎట్టకేలకు టైటిల్ ఖరారైంది. సూర్య నటించిన ‘సూరరై పొట్రు’కు రీమేక్‌గా రూపొందించిన ఈ సినిమాకు ‘సర్ఫిరా’ అనే పేరు పెట్టారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, 2డి ఎంటర్టైన్మెంట్, అబండంటియా ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సుధా కొంగర ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ఆమె గతంలో ‘ఇరుధి సుత్రు’ (తమిళం), ‘సాలా ఖదూస్’ (హిందీ)తోపాటు తెలుగులో వచ్చిన ‘గురు’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పరేష్ రావల్, సీమా బిశ్వాస్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూలై 12న విడుదల కానున్నట్లు అక్షయ్ కుమార్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రకటించారు. ఈ చిత్రానికి కథా రచన సుధ, షాలిని ఉషాదేవి చేశారు. సంగీతం: జి.వి.ప్రకాశ్ కుమార్, నిర్మాతలు: అరుణా భట్టియా, సూర్య, జ్యోతిక, విక్రమ్ మల్హోత్రా.