‘ఎంటర్టైనర్స్’ పేరుతో నార్త్ అమెరికా టూర్‌కు సిద్ధమవుతున్నారు హిందీ స్టార్ అక్షయ్ కు మార్. కొద్ది రోజు ల పాటు సాగే ఈ టూర్‌ను తాజాగా తన సోషల్ మీడి యా ద్వారా ప్రకటించారు అక్షయ్. ‘ఒక భారీ ఈవెంట్‌కు మీరంతా సిద్ధమా? ఎంటర్టైనర్స్ మీ దగ్గరకు వచ్చేస్తున్నది..’ అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఇటీవల కాలంలో అక్షయ్ అంగీకరించిన టూర్ ఇది.
వచ్చే ఏడాది మార్చిలో ఎంటర్టైనర్స్ పర్యటన ప్రారంభం కానుంది. ఇందులో అక్షయ్‌తో పాటు ఇతర తారలు నటించిన సినిమాల్లోని సన్నివేశాలు, అందులోని సూపర్ హిట్ సాంగ్స్ ప్రదర్శనలు ఉండనున్నాయి. వీరు చేయబోయే ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్తమ అమెరికా స్థానికులతో పాటు అక్కడి ఎన్ఆర్ఐలను అలరించబోతున్నాయి. ప్రస్తుతం పలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న అక్షయ్…మరాఠీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేస్తున్నారు. మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న ‘హిస్టారికల్ వేదాత్ మరాఠే వీర్ దౌదాలే సాత్’ అనే చిత్రంలో నటించబోతున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ఛత్రపతి శివాజీ పాత్రలో కనిపించబోతున్నారు.