దాదాపు పదిహేడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్ అగ్ర నటులు అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ కలిసి నటించబోతున్నారు. ‘తషాన్’ (2008) తర్వాత వీరిద్దరు కలిసి నటించలేదు. తాజాగా వీరు కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌లో నటించనున్నట్లు తెలిసింది. ప్రియదర్శన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఇటీవలే దర్శకుడు వీరిద్దరికి స్క్రిప్ట్ వినిపించారని, కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారని ముంబయ్ ఫిల్మ్ వర్గాల సమాచారం.
ఆగస్ట్‌లో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుందని తెలిసింది. ప్రస్తుతం ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్న ‘భూత్ బంగ్లా’ చిత్రంలో నటిస్తున్నారు అక్షయ్‌కమార్. ఇది పూర్తయిన వెంటనే అక్షయ్-సైఫ్అలీఖాన్ కాంబో చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు.