బాలీవుడ్ అగ్ర నటులు అక్షయ్ కుమార్, సైఫ్అలీఖాన్ 17 ఏళ్ల విరామం తర్వాత కలిసి నటించబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ‘హేవాన్’ పేరుతో ఓ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. గురువారం ఈ సినిమా తాలూకు అధికారిక ప్రకటన వెలువడింది. ‘తషాన్’ (2008) చిత్రం తర్వాత ఈ ఇద్దరు స్టార్‌హీరోలు కలిసి నటిస్తుండటం విశేషం.
‘సీట్ఎడ్జ్ థ్రిల్లర్ ఇది. ఈ కథకు అక్షయ్‌కుమార్, సైఫ్అలీఖాన్ పర్ఫెక్ట్ ఛాయిస్‌లా అనిపించారు. ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని సెట్స్‌మీదకు తీసుకొస్తాం. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తాం’ అని దర్శకుడు ప్రియదర్శన్ తెలిపారు. ఇటీవల విడుదలైన ‘కన్నప్ప’ చిత్రంలో శివుడి పాత్రలో మెప్పించారు అక్షయ్‌కుమార్. ప్రస్తుతం ఆయన ‘భూత్‌బంగ్లా’ చిత్రంలో నటిస్తున్నారు.