ANR Birthday Special | దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) 101వ జయంతి సందర్భంగా ఆయన నటించిన సూపర్ హిట్ సినిమాలు రీరిలీజ్ కాబోతున్నాయి. ఏఎన్నార్ నటించిన చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఐకానిక్ సినిమాలు అయిన డాక్టర్ చక్రవర్తి, ప్రేమాభిషేకం (Premabhishekam) చిత్రాలు సెప్టెంబర్ 20న పలు థియేటర్లలో రీ రిలీజ్ కాబోతున్నాయి. వీటికి సంబంధించిన టికెట్లను బుక్ మై షోలో ఉచితంగా అందుబాటులో ఉంచినట్లు అన్నపూర్ణ స్టూడియోస్ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఎంపిక చేసిన థియేటర్స్‌తో పాటు.. విజయవాడ (స్వర్ణ ప్యాలస్), వైజాగ్ (క్రాంతి థియేటర్), ఒంగోలు (కృష్ణ టాకీస్)లలో ఈ సినిమాలు రీరిలీజ్ కానున్నాయి. ఈ థియేటర్లలో టికెట్స్‌ను బుక్ మైషో యాప్‌లో బుక్ చేసుకోవచ్చు.