OG Movie Trailer | అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజిత్ సైన్ దర్శకత్వం వహిస్తుండగా.. డీవీవీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ చేస్తుంది చిత్రయూనిట్. అయితే ఈ మూవీ విడుదలకు వారం రోజులే ఉండడంతో తాజాగా ట్రైలర్ అప్డేట్ను పంచుకుంది. ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 21 ఉదయం 10.08 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
Death quota….confirm anta!! 🤙🏻🤙🏻
The most awaited #OGTrailer on Sep 21st.#OG #TheyCallHimOG pic.twitter.com/lmAo1CkdAU
— DVV Entertainment (@DVVMovies) September 18, 2025