Andhra King Taluka | యువ కథానాయకుడు రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మహేశ్‌బాబు.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ (Andhra King Taluka). ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. భాగ్యశ్రీ భోర్సే కథానాయికగా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ముఖ్యపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు ఆయన బర్త్‌డే సందర్భంగా ఉపేంద్రకి బర్త్‌డే విషెస్ తెలుపుతూ.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో ఉపేంద్ర తన నిజ జీవితానికి తగ్గట్టే సూపర్‌స్టార్‌గా, ఆంధ్ర కింగ్ సూర్యకుమార్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన అభిమానిగా రామ్ పోతినేని కనిపించనున్నారు. రావు రమేశ్, మురళీశర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండగా.. వివేక్ – మెర్విన్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు.
Team #AndhraKingTaluka wishes Real Star @nimmaupendra Garu a very Happy Birthday ❤🔥
His portrayal of ‘Andhra King’ Surya will be loved and celebrated 💥💥#AndhraKingTaluka in cinemas worldwide on November 28th 🤩#AKTonNOV28
Energetic Star @ramsayz #BhagyashriBorse… pic.twitter.com/r1Qx6qFs5k— Mythri Movie Makers (@MythriOfficial) September 18, 2025