టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna) తాజాగా ఓ స్టార్ హీరో సినిమా తెలుగు హక్కులను దక్కించుకున్నాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనుకుంటున్నారా..? తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన కార్తీ (Karthi). ఈ టాలెంటెడ్ హీరో నటిస్తోన్న తాజా ప్రాజెక్టు సర్దార్ (Sardar). పీఎస్ మిత్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఫిలింనగర్లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం సర్దార్ తెలుగు హక్కులు (Sardar rights) నాగ్ దక్కించుకున్నాడని ఇన్ సైడ్ టాక్.
హెంబ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడని వార్తలు వస్తుండగా..దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాశీఖన్నా, లైలా, రజిష విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ చేస్తున్న సర్దార్లో కార్తీ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాడు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.
నాగార్జున, కార్తీ కాంబినేషన్లో వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఊపిరి సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాపీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఊపిరి సినిమాతో నాగ్, కార్తీ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.