e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home News Naga chaitanya : విల‌న్‌గా అక్కినేని హీరో..!

Naga chaitanya : విల‌న్‌గా అక్కినేని హీరో..!

ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న చాలా మంది హీరోలు విల‌న్ నుండి క‌థానాయ‌కులుగా మారిన వారే. ఇప్పుడు యంగ్ హీరో కార్తికేయ ఒక‌వైపు హీరోగా న‌టిస్తూనే మ‌రోవైపు విల‌న్‌గా అల‌రిస్తున్నాడు. దగ్గుబాటి హీరో రానా కూడా విలన్‌గా నటించడానికి ఏమాత్రం వెనకడుగు వేయడు. ఇప్పటికే బాహుబలి సినిమాతోపాటు ఓ బాలీవుడ్ సినిమాలో విలన్‌గా మెప్పించిన రానా.. భీమ్లా నాయ‌క్ కోసం కూడా విల‌న్‌గా మారాడు. ఇందులో డానియ‌ల్ శేఖ‌ర్ అనే నెగెటివ్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి కూడా అంతే. ఈ జాబితాలో మ‌రో హీరో చేర‌బోతున్నాడు.

- Advertisement -

అక్కినేని ఫ్యామిలీ హీరో naga chaitanya రేపు ల‌వ్ స్టోరీ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న విష‌యం తెలిసిందే. Love Story సినిమాకు సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటున్న చైతూ ..Amazon Prime వీడియో కోసం ఓ హారర్ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్టు రివీల్ చేశారు. అందులో తను నెగెటివ్ రోల్ పోషిస్తున్నట్టు కూడా చెప్పారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. విక్ర‌మ్ గ‌తంలో అక్కినేని హీరోల‌తో క‌లిసి ప‌ని చేశారు.‘మనం’ కి దర్శకత్వం వహించిన విక్రమ్ ఇప్పుడు చైతూతో క‌లిసి థ్యాంక్స్ అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement