‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తోన్న చిత్రం అఖండ. ఈ సినిమాతో హాట్రిక్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఉగాది సందర్భంగా విడుదలైన ’అఖండ’టైటిల్ పోస్టర్‌తో పాటు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు టాలీవుడ్లో తక్కువ టైమ్‌లో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన టీజర్‌గా బాలకృష్ణ ‘అఖండ’ సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా.
‘అఖండ’ సినిమాలో బాలకృష్ణ మూడు విభిన్న పాత్రల్లో నటించనున్నారు. ఒకటి కలెక్టర్ పాత్ర అయితే. .రెండోది ఫ్యాక్షనిస్ట్, మూడోది అఘోర అని ఈ సినిమా పోస్టర్స్ బట్టి అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే రేపు సాయంత్రం 7.09ని.లకు చిత్ర ట్రైలర్ విడుదల చేయబోతున్నట్టు ప్రకటన చూసి అభిమానులకు పూనకాలు వచ్చేలా చేశారు మేకర్స్.
ట్రైలర్ అనౌన్స్మెంట్కి సంబంధించి పోస్టర్ విడుదల చేయగా, . ఇందులో బాలకృష్ణ అఘోర లుక్‌లో శివతాండవం చేస్తున్నారు. ఆయన లుక్ మైండ్ బ్లోయింగ్ గా ఉండటం విశేషం. చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.