వరుస ఫ్లాపుల తర్వాత నందమూరి బాలకృష్ణకు అఖండ చిత్రం ఫుల్ బూస్టప్ని అందించింది. ఈ సినిమాతో బాలయ్య-బోయపాటి హ్యాట్రిక్ కొట్టారు. కేవలం తెలుగు రాష్ట్రాల అభిమానులే కాదు.. విదేశాల్లో ఉన్న బాలకృష్ణ అభిమానులు అఖండ సినిమా చూసి అదిరిపోయే రివ్యూలిస్తున్నారు. చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ కీలకపాత్రలు పోషించారు.
అఖండ చిత్రం అఖండ విజయం సాధించిన నేపధ్యంలో ‘అఖండ విజయోత్సవ జాతర’ పేరిట గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహణకు చిత్రటీమ్ సిద్ధమైంది. విజయోత్సవ వేడుకని ఈ రోజు విశాఖపట్నంలోని ఎం జి ఎం గ్రౌండ్స్ ఉడా పార్క్ వద్ద నిర్వహించనుంది యూనిట్. ఇప్పటికే అక్కడ వేడుకకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అయితే గురువారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నాడు బాలకృష్ణ. ఆయనతో పాటు దర్శకుడు బోయపాటి కూడా స్వామి వారిని దర్శించుకున్నారు.
‘‘అఖండ సినిమా అఖండ విజయం సాధించిన సందర్భంగా విశాఖలో విజయోత్సవ సభను ఏర్పాటు చేశాం. ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలియ చేసుకునేందుకు వచ్చాము. సంవత్సరం తొమ్మిది నెలల తర్వాత విడుదలైన సినిమాకు మంచి ఆదరణ చూపించారు.ఘన విజయం అందించారు. ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. ఇది మా విజయం కాదు….చిత్ర పరిశ్రమ విజయం’’ అన్నారు.
Natasimham #NandamuriBalakrishna Director #BoyapatiSreenu and #Akhanda team visited Simhadri appanna temple, Simhachalam.#BlockbusterAkhanda pic.twitter.com/zA0XOpmdtV
— BA Raju's Team (@baraju_SuperHit) December 9, 2021