ఏపీలో అఖండ థియేటర్స్‌కు అధికారుల బ్రేకులు.. కారణం ఇదే..!

akhanda movie | నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగానే విడుదలైంది. గత కొన్ని నెలలుగా కళ తప్పిన బాక్సాఫీస్ దగ్గర రచ్చ రచ్చ చేస్తుంది అఖండ సినిమా. దీనికి వస్తున్న రెస్పాన్స్ చూసి అంతా పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో మాత్రం అఖండ సినిమా ప్రదర్శిస్తున్న కొన్ని థియేటర్స్ పై అధికారులు కన్నెర్ర జేశారు. ప్రభుత్వ విధానాలను తుంగలో తొక్కుతూ.. ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారంటూ థియేటర్స్‌ను సీజ్ చేయడం సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలను తగ్గించడమే కాకుండా రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. దీన్ని ఎవరు కాదన్నా కూడా చర్యలు తప్పవని ముందుగానే హెచ్చరించింది.

బెనిఫిట్ షోలకు అనుమతి లేదని.. అదనపు షోలు వేస్తే చర్యలు తీసుకుంటామని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు ఏపీలో అధికారులు. అయితే కృష్ణా జిల్లా మైలవరంలోని సంఘమిత్ర థియేటర్లో అఖండ సినిమా బెనిఫిట్ షో వేయడంతో రెవెన్యూ అధికారులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. అనుమతులు లేకుండా.. ప్రభుత్వం నిర్దేశించిన సమయం కంటే ముందుగానే సినిమా షో వేయడంతో థియేటర్‌ను సీజ్ చేశారు. ఉదయం బెనిఫిట్ షో వేసిన విషయం తెలుసుకున్న అధికారులు మధ్యాహ్నానికి థియేటర్ కు చేరుకున్నారు. మ్యాట్నీ షో ప్రారంభానికి ముందు టికెట్స్ అన్నీ అమ్ముడుపోయిన తర్వాత.. అభిమానులు వేచి చూస్తున్న సమయంలో వచ్చిన అధికారులు సినిమా ప్రదర్శనను ఆపేసి థియేటర్‌ను సీజ్ చేశారు. దాంతో థియేటర్ వద్ద బాలకృష్ణ అభిమానులు ఆందోళనకు దిగారు. థియేటర్‌ను సీజ్ చేయడంపై మైలవరం డిప్యూటీ తహసీల్దార్ స్పందించారు.
నిబంధనలకు విరుద్ధంగా 8.30 నిముషాలకు షో వేయడంతో సంఘమిత్ర థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దయచేసి దీనికి సహకరించాలని అభిమానులను కోరారు. థియేటర్లో రెండు స్క్రీన్లు ఉండగా.. నిర్ణీత సమయం కంటే ముందుగా షో వేసిన ఒక స్క్రీన్‌ను మాత్రమే సీజ్ చేసినట్లు చెప్పారు అధికారులు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు థియేటర్ తెరవడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. కేవలం కృష్ణా జిల్లా మాత్రమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా అనుమతులు లేకుండా ప్రదర్శించిన థియేటర్స్ అన్నింటికి నోటీసులు ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు రెవెన్యూ అధికారులు. ఏపీ ప్రభుత్వం ఈ మధ్యే సినిమా టికెట్ల ధరలను కూడా నిర్ణయించింది. నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వివిధ కేటగిరీల్లో టికెట్ల ధరలను ఫిక్స్ చేసింది. 5 రూపాయల నుంచి 250 రూపాయల వరకు ఈ టికెట్ రేట్స్ ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Akhanda USA Premieres | అఖండ ఓవర్సీస్ బిజినెస్ సంగతేంటి..?
Akhanda | అఖండ ఎలా ఉన్నాడు.. కామన్ ఆడియన్స్ ఏమంటున్నారు..?
Akhanda : అఖండ దెబ్బకు భయపడుతున్న అమెరికా థియేటర్లు
Akhanda movie review | అఖండ సినిమా రివ్యూ
Akhanda : బాలయ్య అభిమానుల రచ్చ.. ఆస్ట్రేలియాలో షో రద్దు చేసిన పోలీసులు
ఏపీలో సినిమా టికెట్ రేట్లు ఎంత.. లిస్ట్ విడుదల చేసిన ప్రభుత్వం..
Akhanda benefit show | అఖండ సినిమా హైదరాబాద్ బెనిఫిట్ షో టికెట్ ధర తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

