Akhanda | తెలుగు ఇండస్ట్రీలో భారీ సినిమాలు విడుదలై చాలా రోజులు అవుతుంది. దానికి కారణం కరోనా వైరస్ . దీని ప్రభావం గత రెండేళ్లుగా తెలుగు ఇండస్ట్రీతో పాటు అన్ని ఇండస్ట్రీలపైనా పడింది. వైరస్ ప్రభావం తగ్గిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ సినిమాలను విడుదల చేయడానికి ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. కొందరు స్టార్ హీరోలు తమ సినిమాలను నేరుగా డిజిటల్ ప్లాట్ ఫారంలో విడుదల చేస్తున్నారు. రెండు రోజుల కింద కూడా వెంకటేశ్ హీరోగా నటించిన దృశ్యం 2 సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదలైంది. దానికి ముందు నాని హీరోగా నటించిన టక్ జగదీశ్ కూడా ఇలాగే వచ్చింది. ఈ పరిస్థితుల నుంచి ఇండస్ట్రీ పూర్తిగా బయట పడటానికి ఇంకాస్త సమయం పట్టేలా కనిపిస్తోంది. అందుకే భారీ సినిమాలు ఇప్పటి వరకు విడుదల చేయలేదు.
తెలుగులో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో అంచనాలున్న సినిమా ఏది రాలేదు. ఒకవేళ ధైర్యం చేసి విడుదల చేసినా కూడా కలెక్షన్స్ వస్తాయా రావా అనే డైలమాలో ఉన్నారు నిర్మాతలు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, లవ్ స్టోరీ సినిమాలు మంచి కలెక్షన్స్ తీసుకొచ్చిన కూడా 35 కోట్లు దాటలేదు. ఇలాంటి సమయంలో పెద్ద సినిమాలకు ఇలాంటి కలెక్షన్స్ అస్సలు సరిపోవు. పెద్ద సినిమాల కోసం మొహం వాచిపోయిన వేచి చూస్తున్న ప్రేక్షకులకు దాదాపు 8 నెలల తర్వాత అఖండ సినిమా విందు భోజనంలా కనిపిస్తుంది.
బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అఖండ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత బోయపాటి బాలయ్య కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమా విడుదల కోసం తెలుగు ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా వేచి చూస్తుంది. దీనికి వచ్చే కలెక్షన్స్ బట్టి రాబోయే సినిమాల భవిష్యత్తు డిసైడ్ కానుంది. పైగా ఏపీలో ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ మొదలైంది. ఇంతకు ముందులా బెనిఫిట్ షోస్ లేవు. అన్నింటికి మించి అధిక టికెట్ ధరలు ఉండవు. ఇవన్నీ బేరీజు వేసుకొని వచ్చే కలెక్షన్స్ ఎలా ఉంటాయి అని ఆసక్తిగా గమనిస్తున్నారు ట్రేడ్ పండితులు. అందుకే అఖండ సినిమా తెలుగు సినిమాకు ఒక టెస్టింగ్ మూవీగా మారిపోయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
టాలీవుడ్లో మారుతున్న ఈక్వేషన్స్.. మెగా ఇమేజ్ నుంచి బయటపడే ఆలోచనలో అల్లు అర్జున్
ప్రగ్యాజైశ్వాల్కు బిగ్ షాక్..ఇక అఖండపైనే ఆశలు..!
Akhanda | ఈ విషయంలో బాలయ్య అంత రిస్క్ తీసుకుంటాడా..?
చిరంజీవి ట్వీట్‌పై ఏపీ మంత్రి పేర్ని నాని రియాక్షన్..
Tollywood | కొంతమంది హీరోలకు సొంత పేర్లు అసలు కలిసి రావు.. ఇదుగో సాక్ష్యం