చిరంజీవి ట్వీట్‌పై ఏపీ మంత్రి పేర్ని నాని రియాక్షన్..

perni nani reaction on chiranjeevi tweet | ఏపీలో సినిమా ఇండస్ట్రీ విషయంలో సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కొంతమందికి నచ్చడం లేదు. అయినా ఎవరూ ఎదిరించి మాట్లాడటం లేదు. ఈ మధ్యే సినీ నియంత్రణ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రభుత్వ నిర్ణయాలను అసెంబ్లీలో పూసగుచ్చినట్టు చెప్పారు మంత్రి పేర్ని నాని. సినిమా టికెట్ విషయంలో కూడా తీసుకున్న నిర్ణయంపై ఆయన పూర్తి వివరాలు ఇచ్చారు. దీన్ని చాలా మంది సినీ ప్రముఖులు స్వాగతిస్తూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాల్ని కూడా షేర్ చేశారు. ఈ క్రమంలోనే చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఆన్ లైన్ టికెటింగ్ విధానంపై తనదైన శైలిలో స్పందించారు.
జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే.. టికెట్ ధరలలో వెసులుబాటు గురించి పునరాలోచించాలని చిరంజీవి కోరారు. భారీ బడ్జెట్ సినిమాలకు ఇంత తక్కువ టికెట్ రేట్లు ఉంటే వర్కవుట్ అవ్వదని చిరంజీవి అభిప్రాయపడ్డారు. అయితే చిరంజీవి చేసిన ట్వీట్‌పై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. చిరంజీవి అభిప్రాయం గురించి ఏపీ సీఎం జగన్‌తో చర్చిస్తామని.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా టికెట్ ధరలు ఉండేలా చూస్తామని పేర్ని నాని తెలిపారు. చిరంజీవితో పాటు పలువురు సీనియర్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు టికెట్ రేట్లు పెంచాలని కోరారని.. అయితే ప్రస్తుతం సీఎం జగన్ అసెంబ్లీ హడావిడిలో ఉన్నారని పేర్ని నాని చెప్పుకొచ్చారు. కచ్చితంగా మీ సమస్యల గురించి ముఖ్యమంత్రితో చర్చిస్తామని హీరోలు, నిర్మాతలకు హామీ ఇచ్చారు మంత్రి పేర్ని నాని.
ప్రస్తుతం ఏపీలో సినిమాటోగ్రఫీ యాక్ట్ సీఎం జగన్ దగ్గరే ఉంది కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయం ఫైనల్ అంటున్నారు పేర్ని నాని. ఏపీ ప్రభుత్వం అదనపు షోలకు అనుమతి లేదని తీసుకున్న నిర్ణయం వల్ల కూడా నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టాలు తప్పవు. ఈ విషయం గురించి ఏపీ సీఎం జగన్‌తో చర్చించేందుకు ఆయన అపాయింట్మెంట్ కోసం సినీ ప్రముఖులు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన బిజీగా ఉండటం వల్లే వాళ్లను కలవలేకపోతున్నారని పేర్ని నాని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Magizhini : అదరగొడుతున్న లెస్బియన్ సాంగ్.. తమిళంలో రిలీజ్ అయిన ఫస్ట్ వీడియో వైరల్
Chiranjeevi: శివశంకర్ మాస్టర్ వైద్య ఖర్చుల కోసం మూడు లక్షల సాయం చేసిన చిరు
Tollywood | కొంతమంది హీరోలకు సొంత పేర్లు అసలు కలిసి రావు.. ఇదుగో సాక్ష్యం
chiranjeevi | చిరంజీవికి పేరు లేని సినిమా ఏదో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

