ప్రముఖ నృత్య దర్శకులు శివశంకర్ మాస్టర్ ఇటీవల కరోనా బారిన పడి ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. మాస్టర్ ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకడం వల్ల 75 శాతం ఇనెఫెక్షన్ ఉండడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో చికిత్సకు తగిన డబ్బు సహాయం చేయమని శివశంకర్ కుటుంబ సభ్యులు దాతల సాయం కోరారు.
ఇప్పటికే శివశంకర్ మాస్టారుకి అండగా తాము ఉంటామని మంచు విష్ణు, ధనుష్, సోనూసూద్ ముందుకు రాగా, తాజాగా శివశంకర్ మాస్టర్ వైద్య ఖర్చుల నిమిత్తం చిరంజీవి మూడు లక్షల రూపాయల ఆర్ధిక సాయం చేశారు. అలానే వైద్యానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిరంజీవిని కలిసి చెక్ అందుకున్న శివ శంకర్ మాస్టర్ తనయుడు అజయ్ మాట్లాడుతూ.. నాన్న గారికి అనారోగ్యం అనే సంగతి తెలిసిన వెంటనే చిరంజీవి గారు ఫోన్ చేసి పిలిపించారని, తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కును అందించారు అని వెల్లడించారు.
చిరంజీవి గారు అంటే నాన్న గారికి ఎంతో అభిమానం అని పేర్కొన్న అజయ్.. చిరంజీవి గారితో నాన్నగారు కలిసి సినిమాలు చేశారని వెల్లడించారు. ఇటీవల ఆచార్య షూటింగులో కూడా నాన్నగారు చిరంజీవిని కలిశారని అజయ్ గుర్తుచేసుకున్నారు. ఇలాంటి సమయంలో ప్రతి రూపాయి తనకి చాలా అవసరం అని పేర్కొన్న అజయ్ చిరంజీవి గారు చేసిన సాయం ఎన్నటికీ మరువలేని ఆయనకి ఎన్నటికీ రుణపడి ఉంటానని ” అన్నారు.
#Megastar @KChiruTweets garu helped #shivashankar master family with a donation of ₹3 lakhs.
— Siva Cherry (@sivacherry9) November 26, 2021
Boss 🙏🏻✊🏻 pic.twitter.com/VVxdcV7DWL