బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ-2’ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఉపయోగించిన రాక్స్ అనే ప్రత్యేక వాహనాన్ని ఎక్స్‌డ్రైవ్ అనే సంస్థ నిర్మించింది. దీనికి ఎక్స్ స్టూడియోస్ సినిమాటిక్ లుక్‌ని అందించింది. గురువారం జరిగిన ఓ ఈవెంట్లో ఈ వెహికిల్‌ని ప్రత్యేకంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ..సినిమాలో బాలకృష్ణ పోషించిన పవర్ఫుల్ క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసేలా ఈ వాహనం ఉంటుందని, యాక్షన్ సన్నివేశాల్లో దీనిని అద్భుతంగా వాడుకున్నామని, తక్కువ సమయంలోనే తాము కోరుకున్న విధంగా ఎక్స్‌డ్రైవ్ సంస్థ ఈ వాహనాన్ని అందించిందని ప్రశంసించారు. ఆటోమోటివ్ ఇన్నోవేషన్‌కు ప్రతీకగా టాలీవుడ్లో హీరో కాన్సెప్ట్ వెహికిల్‌ను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని ఎక్స్‌డ్రైవ్ సంస్థ హెడ్ అమర్ పేర్కొన్నారు.