Nandamuri Balakrishna | నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘అఖండ 2’ బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టించింది. వీరి కలయికలో 2021లో విడుదలై సంచలనం సృష్టించిన ‘అఖండ’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్, డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం తొలిరోజే కలెక్షన్ల రికార్డులను తిరగరాసింది. నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం, ‘అఖండ 2’ ప్రీమియర్స్‌తో కలిపి తొలిరోజు ఏకంగా రూ. 59.5 కోట్లు (Akhanda 2 First Day Collections) వసూలు చేసినట్లు తెలిపింది. ఇది బాలకృష్ణ కెరీర్లోనే ఒక సినిమా మొదటిరోజు ఈ స్థాయిలో వసూలు చేసిన మొదటి చిత్రం కావడం విశేషం.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ చిత్రంలో దర్శకుడు బోయపాటి శ్రీను దేశభక్తి, ధర్మం అనే అంశాలను యాక్షన్, ఫ్యాంటసీ మేళవింపుతో చూపించారు. భారతదేశాన్ని నిర్వీర్యం చేయాలంటే ముందుగా ఇక్కడి ప్రజలకు దేవుడిపై, ధర్మంపై ఉన్న నమ్మకాన్ని చంపేయాలని శత్రుదేశం చైనా క్రూరమైన ఆలోచన చేస్తుంది. అందుకోసం ఒక భయంకరమైన వైరస్‌ను సృష్టించి, స్వార్థపరుడైన ఒక ఇండియన్ రాజకీయ నాయకుడి (పొలిటీషియన్) సహాయంతో దానిని మహాకుంభమేళా సందర్భంగా గంగానదిలో కలుపుతుంది. దాంతో ఆ వైరస్ దేశమంతా వ్యాపించి, ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటారు. ఇదే అదనుగా, సదరు పొలిటీషియన్ చేత ‘దేవుడు లేడు, నిజంగా దైవం ఉంటే ఇలాంటి ఉపద్రవం జరిగేదా?’ అంటూ చైనా విస్తృత ప్రచారం చేయిస్తుంది. దీనివల్ల ప్రజలకు దైవంపై నమ్మకం సన్నగిల్లి, ధర్మాన్ని విడిచిపెడతారు. అప్పుడే దేశాన్ని తేలిగ్గా నాశనం చేయవచ్చనేది వారి ప్రధాన వ్యూహం.
మరోవైపు, ఈ వైరస్‌కు విరుగుడుగా వ్యాక్సిన్‌ని కనుక్కొంటుంది సైంటిస్ట్ జనని (హర్షాలీ మల్హోత్రా). అయితే, ఆ వ్యాక్సిన్ దేశానికి చేరకుండా చైనా విపరీతమైన విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఈ క్రమంలో జనని ప్రమాదంలో పడుతుంది, వ్యాక్సిన్ శత్రువుల చేతికి చిక్కుతుంది. హిమాలయాల్లో ప్రాణభయంతో పరుగులు తీస్తున్న జనని ఆర్తనాదం, తపోనిష్టలో ఉన్న అఖండ (బాలకృష్ణ) చెవిన పడుతుంది. ఆవిధంగా, ధర్మ రక్షణ కోసం మరియు దేశ ప్రజల నమ్మకాన్ని కాపాడటం కోసం అఖండ రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత అఖండ ఆ దుష్టశక్తులపై ఎలా పోరాడాడు? ఆ ఉపద్రవాన్ని ఎలా ఆపాడు? అనేది సినిమాలోని మిగతా కథ. బాలకృష్ణ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్, బోయపాటి శ్రీను టేకింగ్‌తో ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటోంది.
The DIVINE ROAR is heard LOUD & CLEAR 💥💥#Akhanda2 collects a gross of 59.5 CRORES+ on Day 1 (including premieres), making it the biggest opener for God of Masses #NandamuriBalakrishna ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/8l5WolzzT6#Akhanda2Thaandavam… pic.twitter.com/YpXzF1xRyE— 14 Reels Plus (@14ReelsPlus) December 13, 2025