e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, January 21, 2022
Home News వచ్చే వారం ఇద్ద‌రు ఫ్లాప్ హీరోల పోటీ.. మ‌రి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ గెలిచేదెవ‌రో

వచ్చే వారం ఇద్ద‌రు ఫ్లాప్ హీరోల పోటీ.. మ‌రి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ గెలిచేదెవ‌రో

Romantic vs varudu kavalenu | బాక్సాఫీసు ద‌గ్గర ఇద్ద‌రు యువ హీరోలు పోటీ ప‌డుతున్నారు. ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఈ ఇద్ద‌రు హీరోలు ఎట్ట‌కేల‌కు స‌క్సెస్ రుచి చూడాల‌న్న ఆశ‌తో వచ్చే శుక్ర‌వారం ( ఈ నెల 29న ) త‌మ సినిమాల‌ను విడుద‌ల చేస్తున్నారు. అందులో ఒక‌రు నాగ శౌర్య కాగా.. ఇంకొక‌రు పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్ పూరీ. నాగ శౌర్య న‌టించిన వ‌రుడు కావ‌లెను.. ఆకాశ్ పూరీ న‌టించిన రొమాంటిక్ ఈ రెండు సినిమాలు కూడా ఈ నెల 29న థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతున్నాయి.

Romantic and varudu kavalenu
Romantic and varudu kavalenu

ఛ‌లో సినిమాతో త‌న కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు నాగ‌శౌర్య‌. కానీ ఆ త‌ర్వాత ఆ స్థాయిలో హిట్‌ను అందుకోలేక‌పోయాడు. మ‌ధ్య‌లో ఈయ‌న న‌టించిన ఓ బేబీ చిత్రానికి విజ‌యాన్ని సాధించింది. కానీ ఆ సినిమా క్రెడిట్ మొత్తం స‌మంత‌కే ద‌క్కుతుంది. పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ సినిమాగానే ఉండ‌టంతో దీన్ని నాగ‌శౌర్య హిట్‌గా చెప్పుకోలేం. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో విడుద‌లైన అశ్వ‌త్ధామ కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల‌ని వ‌రుడు కావ‌లెను సినిమాతో వ‌స్తున్నాడు ఈ యువ హీరో. రీతూ వ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా ల‌క్ష్మీ సౌజ‌న్య ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌య‌మ‌వుతుంది. సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గోపి సుందర్ స్వరాలు అందించిన పాట‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. దిగు దిగు నాగ.. పాట‌తో పాటు సినిమా టీజ‌ర్‌.. ఈ సినిమాపై అంచ‌నాలు పెంచేశాయి. ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ సినిమా ఈ నెల 29న విడుద‌ల కాబోతోంది. నిజానికి ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆ స‌మయానికి మ‌హాస‌ముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, పెళ్లి సంద‌డి వంటి సినిమాలు ఉండ‌టంతో రిలీజ్‌ను వాయిదా వేశారు.

- Advertisement -

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌యుడిగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్ పూరీ.. హీరోగా గుర్తింపు తెచ్చుకునేందుకు పోరాడుతూనే ఉన్నాడు. ఆంధ్రా పోరీ, మెహ‌బూబా వంటి సినిమాల్లో హీరోగా న‌టించిన‌ప్ప‌టికీ ఈయ‌న‌కు పెద్ద స‌క్సెస్‌ను తీసుకురాలేక‌పోయింది. దీంతో త‌న కొడుకుకు ఎలాగైనా హీరోగా స‌క్సెస్ అందించాల‌ని పూరీ జ‌గ‌న్నాథ్ రంగంలోకి దిగాడు. ఆకాశ్ పూరీని హీరోగా పెట్టి పూరీ క‌నెక్ట్స్ బ్యాన‌ర్‌లో ఛార్మితో క‌లిసి రొమాంటిక్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు కూడా పూరీ జ‌గ‌న్నాథ్ అందించ‌డం విశేషం. అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా పోస్ట‌ర్లు సినిమాపై ఆస‌క్తిని రేకితిస్తున్నాయి. ఈ చిత్ర షూటింగ్ పూర్త‌యి చాలా రోజులే అవుతుంది. కానీ క‌రోనా కార‌ణంగా ప‌లుమార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఈ నెల 29న ఈ సినిమా విడుద‌ల కాబోతోంది. ఫ్లాపుల్లో ఉన్న ఈ ఇద్ద‌రు హీరోల్లో ఎవ‌రు హిట్ కొడ‌తారో చూడాలి మ‌రి !

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Varudu Kaavalenu: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న ఫోక్ సాంగ్..!

Ketika Sharma | కేతిక శ‌ర్మ ‘రొమాంటిక్’ క‌వ‌ర్ సాంగ్ చూడాల్సిందే..వీడియో

Romantic Trailer | ఐ లైక్ దిస్ ఎనిమ‌ల్‌..‘రొమాంటిక్’ గా ట్రైల‌ర్

చీర‌క‌ట్టులో నడుము అందాలు చూపిస్తున్న అనుపమ పరమేశ్వరన్..

Pawan Kalyan | కొత్త సినిమాల‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ నో..కార‌ణ‌మిదే !

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement