AjithKumar Racing | దుబాయ్ కార్ రేసింగ్‌లో కోలీవుడ్ స్టార్ యాక్టర్ అజిత్‌కుమార్ (Ajith kumar) భారీ ప్రమాదం నుంచి బయటపడ్డ సంగతి తెలిసిందే. దుబాయ్‌లో రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అజిత్ కారు ట్రాక్‌ను ఢీకొట్టింది. అయితే అప్రమత్తమైన అజిత్‌కుమార్ వెంటనే కారును కంట్రోల్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.. స్వల్ప గాయాలతో కారులో నుంచి బయటపడ్డాడు అజిత్ కుమార్.
అయితే అజిత్ కుమార్ అభిమానుల్లో జోష్ నింపే వార్త ఒకటి ఫొటోల రూపంలో బయటకు వచ్చింది. అజిత్‌కుమార్ రేసింగ్ టీంతో కలిసి ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అజిత్‌కుమార్ రేసింగ్ గురించి అతని మేనేజర్ సురేశ్ చంద్ర మాట్లాడుతూ..ఈ శనివారం జరగనున్న ఎండ్యూరెన్స్ రేసు (Dubai 24H event)లో పాల్గొనే నలుగురు డ్రైవర్లలో మిస్టర్ అజిత్ ఒకరు. ఆయన వరుసగా నాలుగు గంటలు డ్రైవింగ్ ప్రాక్టీస్ చేశారు. చివరగా దాదాపు 3-3.5 గంటలు డ్రైవింగ్ చేశాడు. అయితే కొంచెం దృశ్యమానత (విజిబులిటి)లో నెలకొన్న సమస్య కారణంగా జరిగిన ప్రమాదంలో కారు దెబ్బతిన్నది.
అయితే ఆయనకు ఏం కాలేదు. అంబులెన్స్ స్పాట్‌కు చేరుకుంది. అజిత్ కారులో నుంచి బయటకు వచ్చి.. దగ్గరలో ఉన్న గ్రిడ్‌కు వెళ్లారు. వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పరీశిలించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన నెక్ట్స్ ప్రాక్టీస్ సెషన్లో భాగంగా నేటి నుంచి యాక్షన్‌లోకి దిగుతారని చెప్పాడు. ఈ నేపథ్యంలో తాజా ఫొటోలు చూసిన అభిమానులు అజిత్‌కుమార్ యాక్షన్ మూడ్‌లోకి వచ్చేశాడంటూ సంబురాలు చేసుకుంటున్నారు.
Ajith Kumar Racing team at the vehicle Testing centre for the 24H Dubai 2025 🏁💥#Ajith #AKRacing #AjithKumar #AjithKumarRacing #24hDubai #DubaiRaceWeekend #racing pic.twitter.com/Wj9j6ZrZ37
— Kumari Mavatta Thalamai BILLA Groups ✨ KMTBG™ (@KMTBG_FC) January 9, 2025
రేసింగ్‌లో ట్రాక్‌ను ఢీకొట్టిన కారు..
{ 💔💔💔💔💔💔💔💔💔💔💔 }
From The Bottom Of Our Hearts, We, Your Fans, Wish You a Safe Racing journey, Chief.
Your Safety and Health Mean More Than Anything to Us. May God be with you always 🙏🏻#AjithKumar pic.twitter.com/vtkR4wCETI
— AJITHKUMAR FANS CLUB (@ThalaAjith_FC) January 7, 2025
Daaku Maharaaj | డాకుమహారాజ్ సెట్స్‌లో బాలకృష్ణను హత్తుకొని ఏడ్చేసిన చిన్నారి
Ramya | ఆ సన్నివేశాలు తొలగించండి.. కోర్టును ఆశ్రయించిన నటి రమ్య