దుబాయ్‌లో జరిగిన 24హెచ్ కారు రేసింగ్‌లో తమిళ అగ్ర నటుడు అజిత్ సత్తా చాటారు. ‘అజిత్‌కుమార్ రేసింగ్’ పేరుతో ఇటీవల ఒక రేసింగ్ టీమ్‌ని అజిత్ ప్రకటించారు. తాజాగా దుబాయ్ వేదికగా ఆదివారం హోరాహోరీగా సాగిన కారు రేసింగ్‌లో అజిత్ జట్టు మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఈ ఆనందాన్ని తన కుటుంబ సభ్యులతో పంచుకున్నారు అజిత్. తన భార్య షాలినికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘రేసులో పాల్గొనేందుకు అనుమతినిచ్చినందుకు నీకు ధన్యవాదాలు షాలు..’ అంటూ తన భార్య షాలినిని అజిత్ హత్తుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కార్, బైక్ రేసులను అమితంగా ఇష్టపడతారు అజిత్. అయితే.. గత కొన్నాళ్లుగా ఆయన వాటికి దూరంగా ఉంటూ వచ్చారు.
ఇప్పుడు మళ్లీ ఆయన మనసు రేసింగ్‌లపై మళ్లింది. అందుకే.. తన స్పోర్ట్స్ కార్ని మళ్లీ ట్రాక్ ఎక్కించారు. దుబాయ్ కార్ రేసింగ్ కోసం సన్నద్ధమవుతూ ఇటీవలే ఆయన ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో కారు ముందు భాగం ఛిద్రమవ్వగా, అజిత్ మాత్రం గాయలపాలవ్వకుండా బయట పడ్డారు. ఆ ప్రమాదం జరిగిన రెండు రోజులకు జరిగిన ఈ పోటీల్లో అజిత్ జట్టు మూడో స్థానంలో నిలవడం గమనార్హం. ఇదిలావుంటే.. ఈ ఘనత సాధించిన అజిత్‌కి ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రజనీకాంత్, పవన్‌కళ్యాణ్, ఉదయ్‌నిధి స్టాలెన్, సమంతలతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అజిత్‌కు అభినందనలు తెలిపారు.
అద్భుతమైన ఫలితమది.. గొప్ప లక్ష్యం, దాన్ని సాధించాలన్న ఉత్సుకత, సంకల్పానికి ఈ విజయం నిదర్శనం. దేశానికే గర్వకారణమైన ఘనత ఇది. కంగాట్స్ అజిత్గారు..