Ajith | తమిళనాట రజనీకాంత్, విజయ్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు ఎవరంటే అజిత్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన ఆయన స్టార్ హీరోగా ఎదిగారు. అనేక సూపర్ హిట్ చిత్రాలతో తమిళ ప్రేక్షకులనే కాక తెలుగు ప్రేక్షకులని సైతం అలరించారు. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులకి కొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తుంటారు. ఇటీవలే విదాముయార్చి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చి అలరించాడు. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా అజిత్ కార్ రేసింగ్, బైక్ రేసింగ్‌లపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడన్న విషయం తెలిసిందే.
చెన్నైలోని ఐఐటీ ( ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ) విద్యార్థుల ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన తక్ష డ్రోన్ ప్రాజెక్టుకు ఆయన సలహాదారుగా కూడా వ్యవహరించారు. 2025లో దుబాయ్‌లో జరిగిన కార్ రేస్‌లో పాల్గొన్నాడు అజిత్. తన జట్టు 911 GT3 R విభాగంలో 3వ స్థానంలో నిలిచింది. ఇక ఇప్పుడు అజిత్ తన కొడుకు ఆద్విక్కి కారు రేసింగ్‌లో మెళుకువలు నేర్పించడంలో నిమగ్నమయ్యాడు. ఆద్విక్ మంచి టాలెంటెడ్ పర్సన్. ఇటీవల పాఠశాలలో జరిగిన రన్నింగ్ రేస్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత బ్రెజిల్ లెజెండ్స్ జట్టు, ఇండియా ఆల్ స్టార్స్ జట్టు మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లోనూ ఆద్విక్ సత్తా చాటి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.
ఇక ఇప్పుడు తన తండ్రిలాగే కార్ రేస్ శిక్షణలో నిమగ్నమయ్యాడు ఆద్విక్. కారు రేసింగ్‌లో ఆద్విక్ పాల్గొన్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. MIKA గో కార్ట్ సర్క్యూట్లో జరిగిన కార్ రేస్ వీడియోనూ అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర షేర్ చేశారు. అందులోఅజిత్ తన కొడుకుకు కార్ రేసింగ్ గురించి చిట్కాలు ఇస్తుండడం మనం గమనించవచ్చు. ప్రస్తుతం పిక్స్, వీడియోస్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే..అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అజిత్ సరసన త్రిష కథానాయికగా నటిస్తుండగా.. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఇటీవలే నటుడిగా పద్మ భూషణ్ అవార్డ్ అందుకున్నారు అజిత్.
Ajith & family spotted at MIKA Go Kart Circuit, embracing the need for speed! 🏎️💨 Pure racing passion on display! 🔥
A special thanks to MIKA Madras International Karting Arena & MIC Madras International Circuit.#AjithKumar #MIKAGoKart pic.twitter.com/2s45U06uK6
— Suresh Chandra (@SureshChandraa) April 3, 2025