ఫార్ములా వన్ రేసింగ్ నేపథ్యంలో వచ్చిన హాలీవుడ్ చిత్రం ‘ఎఫ్1’ ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అగ్ర నటుడు బ్రాడ్‌పిట్ కెరీర్లో కమ్‌బ్యాక్ ఫిల్మ్‌గా నిలిచింది. ఇండియాలో ఈ సినిమా వందకోట్లకుపైగా వసూళ్లను సాధించింది. స్ఫూర్తిదాయక కథాంశంతో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామా రీమేక్ కోసం పలువురు దర్శకనిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ప్రొఫెషనల్ రేసర్ అయిన అగ్ర హీరో అజిత్ ఈ సినిమా రీమేక్ పట్ల ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమా కోసం ఎవరైన తనను సంప్రదిస్తే తప్పకుండా అంగీకరిస్తానని, రేసింగ్ స్పోర్ట్‌ని మరింత మందికి చేరువ చేసినట్లవుతుందని అజిత్ పేర్కొన్నారు. ఇప్పటికే వివిధ దేశాల్లో పలు రేసింగ్ కాంపిటీషన్స్‌లో పాల్గొని సత్తా చాటిన అజిత్ అయితేనే ఈ సినిమాకు పర్ఫెక్ట్గా సరిపోతాడని, మరొకరిని ఈ పాత్రలో ఊహించలేమని సోషల్‌మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామాను ఏ దర్శకుడి టేకాఫ్ చేస్తారో వేచిచూడాలి.