కార్ రేసింగ్ ట్రాక్‌పై జరిగిన ప్రమాదం నుంచి అగ్ర నటుడు అజిత్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ నెల 11, 12న దుబాయ్‌లో జరుగనున్న 24హెచ్ కార్ రేసింగ్ పోటీల్లో పాల్గొనేందుకు ఆయన ఇటీవలే అక్కడకు వెళ్లారు. ప్రాక్టీస్ సమయంలో ఆయన నడుపుతున్న కారు అదుపుతప్పి బలంగా గోడను ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం మొత్తం డ్యామేజీ అయింది. వెంటనే భద్రతా సిబ్బంది ఆయన్ని మరో కారులోకి తరలించారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇదిలావుండగా అజిత్‌కు ప్రొఫెషనల్ రేసర్‌గా మంచి పేరుంది. విరామ సమయాల్లో కారు, బైక్ రేసింగ్స్ని ఎంజాయ్ చేస్తుంటారు. హైదరాబాద్, చెన్నై మధ్య ఆయన ఎన్నోసార్లు బైక్ టూర్ చేశారు. మోటార్ సైకిల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ఆయన ఓ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. అజిత్ ప్రస్తుతం ‘విదాముయార్చి’ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం ఏప్రిల్ 10న విడుదలకానుంది.