Good Bad Ugly | అభిమానులను ఊపిరాడకుండా చేసేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు కోలీవుడ్ స్టార్ యాక్టర్ అజిత్ కుమార్ (Ajith kumar). ఈ స్టార్ యాక్టర్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly). అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోంది.
ఈ చిత్రం పొంగళ్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని వార్తలు వచ్చినా.. రిలీజ్ విషయంలో డైలామా కొనసాగుతూనే ఉంది. ఫైనల్‌గా మేకర్స్ విడుదలపై క్లారిటీ ఇచ్చేశారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ కొత్త లుక్ ఒకటి షేర్ చేశారు. వేరే లెవల్ ఎంటర్టైన్మెంట్ కోసం డేట్ లాక్ చేశాం.. అంటూ లాంచ్ చేసిన పోస్టర్లో అజిత్ కుమార్ చేతిలో పిస్తోల్ పట్టుకొని సాల్ట్ పెప్పర్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు.
ఈ చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. యోగిబాబు, రాహుల్ దేవ్, అర్జున్ దాస్, సునీల్, ప్రభు ఇతక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అజిత్ కుమార్ దీంతోపాటు మగిజ్ తిరుమేని డైరెక్షన్లో విదాముయార్చి సినిమా కూడా చేస్తున్నాడు.
అజిత్ సార్ నాకు ఈ జీవితకాల అవకాశాన్ని అందించినందుకు ధన్యవాదాలు. నా కల నెరవేరింది. చివరి రోజు షూటింగ్.. ఎంత అందమైన ప్రయాణం..లవ్ యూ సో మచ్ సార్ అంటూ అధిక్ రవిచంద్రన్ షేర్ చేసిన వీడియో, ఫొటో ఇప్పటికే నెట్టింట రౌండప్ చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి
గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ అప్డేట్ పోస్టర్..
#GoodBadUgly arrives on April 10th❤️🙏🏻 @MythriOfficial @SureshChandraa pic.twitter.com/K6N1x7uANT
— Adhik Ravichandran (@Adhikravi) January 6, 2025
Toxic | హాలీవుడ్ స్టైల్లో యశ్ బాస్.. టాక్సిక్ ఫస్ట్ లుక్ లాంచ్ టైం ఫిక్స్
Maharaja | చైనా బాక్సాఫీస్నూ వదలని విజయ్‌సేతుపతి.. మహారాజ అరుదైన రికార్డ్
Pushpa 2 The Rule | బాహుబలి 2 రికార్డ్ బ్రేక్.. అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఇవే