Ajith Kumar | తమిళ అగ్ర హీరో అజిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నది. తాజా షెడ్యూల్లో అజిత్‌తో పాటు చిత్ర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో అజిత్ పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుంది. ైస్టెలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నాం. పోరాట ఘట్టాలు హైలైట్‌గా నిలుస్తాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం మరో ఆకర్షణ. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అభినందన్ రామానుజం, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: అధిక్ రవిచంద్రన్.