తమిళ స్టార్ హీరో అజిత్‌కుమార్ హీరోగా రూపొందుతోన్న ద్విభాషా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్నది.
ప్రమోషన్లో భాగంగా ఆదివారం అభిమానులకోసం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. టైటిల్‌కి తగ్గట్టు మూడు భిన్నమైన కోణాల్లో అజిత్ కనిపిస్తున్నారు. మూడు లుక్స్‌లో మూడు డిఫరెంట్ వేరేషన్స్తో అజిత్ మెస్మరైజ్ చేస్తారని మేకర్స్ చెబుతున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాకు కెమెరా: అభినందన్ రామానుజం, సంగీతం: దేవిశ్రీప్రసాద్.