డీజే కావాలని కలలుకనే మ్యూజిక్ షాప్ యజమానిగా అజయ్‌ఘోష్, ఆ లక్ష్యాన్ని సాధించడంలో అతని సాయం చేసే ఇన్స్పైరింగ్ రోల్లో చాందిని చౌదరి నటిస్తున్న ఎమోషనల్ డ్రామా ‘మ్యూజిక్షాప్ మూర్తి’. శివ పాలడుగు దర్శకుడు. హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాతలు. ఈ సినిమా జూన్ 14న విడుదల కానుంది.
ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇంకో మూడు వారాల్లో ప్రేక్షకులకు అద్భుతమైన ఎమోషనల్ ట్రీట్ ఇవ్వబోతున్నామని, ఇది సకుటుంబంగా చూడదగ్గ ఫ్యామిలీ ఎంటైర్టెనర్ అని నిర్మాతలు తెలిపారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, బేబీ, డి.జె.టిల్లు చిత్రాలను పంపిణీ చేసిన ధీరజ్ మొగిలినేని ఎంటైర్టెన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్ బెజుగం, సంగీతం: పవన్.