Drishyam 3 | మాలీవుడ్‌లో తెరకెక్కి పలు భాషల్లో విడుదలై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన ప్రాంచైజీ దృశ్యం (Drishyam). మలయాళంలో క్రైం థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ మూవీకి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. ఈ ప్రాంచైజీలో దృశ్యం 3 కూడా వస్తోన్న విషయం తెలిసిందే. మోహన్ లాల్ (Mohan lal), మీనా లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న దృశ్యం 3 షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. కాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రాకముందే.. దృశ్యం 3 హిందీ వెర్షన్‌పై అదిరిపోయే అప్డేట్ అందించారు మేకర్స్.
అజయ్ దేవ్గన్, శ్రియా శరణ్ కాంబోలో వస్తోన్న మూడో పార్టు రిలీజ్ డేట్‌ను ఎవరూ ఊహించని విధంగా లాక్ చేశారు మేకర్స్. దృశ్యం 3ను 2026 అక్టోబర్ 2న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం హిందీ వెర్షన్ షూటింగ్ కొనసాగుతుంది. ఈ మూవీలో టబు, రజత్ కపూర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అభిషేక్ పాఠక్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని స్టార్ స్టూడియోస్ సమర్పణలో పనోరమ స్టూడియోస్ సమర్పిస్తోంది.
కాగా దృశ్యం 3 ఒరిజినల్ వెర్షన్ థ్రియాట్రికల్, డిజిటల్ రైట్స్ కలిపి ఏకంగా రూ.350 కోట్లు పలికాయని మాలీవుడ్ సర్కిల్లో ఓ వార్త ఇప్పటికే హల్ చల్ చేస్తోంది. జార్జ్‌కుట్టీ (మోహన్ లాల్ పాత్ర) ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన దశ్యం ప్రాంచైజీలో వచ్చిన రెండు పార్టులు ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఫస్ట్ పార్ట్ థియేటర్లో విడుదలవగా.. రెండో పార్టు ఓటీటీలో విడుదలైంది. ఆశీర్వాద్ సినిమాస్ దశ్యం 3ని తెరకెక్కిస్తోంది. మరోవైపు హిందీలో కూడా దశ్యం 3 షూటింగ్ జరుపుకుంటూ వార్తల్లో నిలుస్తోంది.
దృశ్యం కథ తెలుగు, తమిళం, హిందీతోపాటు వివిధ భాషల ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే తెలుగులో వెంకటేశ్, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో రీమేక్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
#Drishyam3 on #DrishyamDay
Aakhri hissa baaki hai.
In cinemas on 2nd October, 2026. https://t.co/b2Eo83h62p— Ajay Devgn (@ajaydevgn) December 22, 2025
Mysaa | అగ్రెసివ్‌గా రష్మిక మందన్నా.. మైసా ఫస్ట్ గ్లింప్స్ వచ్చేస్తుంది
Bala Krishna | నార్త్ మార్కెట్లో ఆశలు నెరవేరవా.. బాలకృష్ణకి కూడా నిరాశే ఎదురైందా?