ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) టైటిల్ రోల్ నటించిన చిత్రం డ్రైవర్ జమున (Driver Jamuna). ఈ చిత్రం తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో డిసెంబర్ 30న విడుదలైంది. ఐశ్వర్య రాజేశ్ క్యాబ్ డ్రైవర్‌గా ప్రయాణం కొనసాగిస్తున్న సమయంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
మేకర్స్ డ్రైవర్ జమున మేకింగ్ వీడియోను లాంఛ్ చేశారు. ఈ సినిమా కోసం ఐశ్వర్య రాజేశ్ ఎలా కష్టపడింతో తాజా మేకింగ్ వీడియోతో అర్థమవుతుంది. క్రైం థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కిన్స్టిన్ డైరెక్ట్ చేశాడు. 18 రీల్స్ బ్యానర్‌పై తెరకెక్కించిన ఈ చిత్రంలో వైభవ్ గోహిల్, ఆకుకాలం నరేన్, శ్రీరంజనీ కీలక పాత్రల్లో నటించారు.
గ్లామరస్ రోల్స్ తోపాటు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు పోషించే ఐశ్వర్య రాజేశ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ భామ మలయాళంలో రెండు, తమిళంలో తొమ్మిది, హిందీలో ఓ సినిమా చేస్తుండగా.. షూటింగ్ దశలో ఉన్నాయి.
డ్రైవర్ జమున మేకింగ్ వీడియో..
డ్రైవర్ జమున ట్రైలర్..