తమిళ చిత్రసీమలో ప్రతిభావంతురాలైన నటిగా గుర్తింపును సంపాదించుకుంది ఐశ్వర్య రాజేష్. కమర్షియల్ పంథాకు భిన్నంగా మహిళా ప్రధాన ఇతివృత్తాలను ఎంచుకుంటూ సత్తా చాటుతున్నది. ఐశ్వర్య రాజేష్ నటిస్తున్న సినిమా అంటే కథాపరంగా ఏదో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఆరు చిత్రాలున్నాయి. అవన్నీ లేడీ ఓరియెంటెడ్ కావడం విశేషం. ఆమె మాట్లాడుతూ ‘కెరీర్ తొలినాళ్లలో ‘కాకాముైట్టె’ అనే చిత్రంలో నా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.
ఇండస్ట్రీలోని అగ్ర హీరోలందరూ మెచ్చుకున్నారు. అయినా నేను అవకాశాలు లేక ఏడాది పాటు ఖాళీగా ఉన్నా. నటిగా నిరూపించుకోవాలంటే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను చేయడమే బెటర్ అనిపించింది. నా సినిమాలో నేనే హీరో కావాలనుకున్నా. అప్పటి నుంచి కాన్సెప్ట్ ప్రధానమైన కథలపై దృష్టిపెట్టా. ఇప్పుడు నాకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. నన్ను అభిమానించే ప్రేక్షకులు తయారయ్యారు’ అని చెప్పింది. ఇటీవలే ‘ఫర్హానా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఐశ్వర్య రాజేష్.
Rangabali Review | రంగబలి ఎలా ఉంది.. ప్రీమియర్ షో టాక్..
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినిమాల రీరిలీజ్లు ఆపేస్తేనే బెటర్ ఏమో!
Salaar Teaser | సలార్ టీజర్లో హైలెట్ అయిన ఈ యాక్టర్ ఎవరో గుర్తున్నాడా?
Krithi Shetty | బేబమ్మ మళ్లీ పుంజుకుంటుందా.. మూడు ఇండస్ట్రీల్లో మూడు భారీ సినిమాలు..!